salmani khurshid: కేంద్రంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రావడం కష్టమే : సల్మాన్ ఖుర్షీద్

  • బీజేపీని ఓడించేందుకు భాగస్వామ్య పక్షాలన్నీ ఏకం కావాలి
  • త్యాగాలు, సీట్ల సర్దుబాటుకు సిద్ధపడాలి
  • భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించాలని కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి రావడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు భాగస్వామ్య పక్షాలన్నీ సిద్ధంకావాల్సి ఉందని చెప్పారు. ఈ క్రమంలో కొన్ని త్యాగాలు, సర్దుబాట్లకు కూడా సిద్ధపడాలని అన్నారు. త్యాగాలకు సిద్ధపడి కూటమి ఏర్పాటుకు కలసిరావాలని తెలిపారు. భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ఎంత కృషి చేయాలో అంత చేస్తుందని చెప్పారు. 
salmani khurshid
Congress
bjp
alliance

More Telugu News