west indies: టీమిండియాకు చుక్కలు చూపించిన వెస్టిండీస్.. ఇండియా ముందు భారీ టార్గెట్

  • 322 పరుగుల భారీ స్కోరు సాధించిన వెస్టిండీస్
  • 78 బంతుల్లో 106 పరుగులు చేసిన హెట్ మయోర్
  • హాఫ్ సెంచరీ సాధించిన కీరన్ పావెల్
గువాహటిలో జరుగుతున్న తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ దూకుడుగా ఆడింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. తద్వారా భారత్ ముందు భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. 19 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయినా... విండీస్ బ్యాట్స్ మెన్లు వెనకడుగు వేయలేదు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు.

విండీస్ బ్యాట్స్ మెన్లలో  హెట్ మయెర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 78 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. అనంతరం జడేజా బౌలింగ్ టో పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కీరన్ పావెల్ 51, హేమ్ రాజ్ 9, హోప్ 32, శామ్యూల్స్ డకౌట్, రోమన్ పావెల్ 22, హోల్డర్ 38, నర్స్ 2, బిషూ 22, రోచ్ 26 పరుగులు చేశారు. బిషూ, రోచ్ లు నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో చాహల్ 3, జడేజా, షమీ చెరో 2, అహ్మద్ ఒక వికెట్ తీశారు.
west indies
team india
first
one day

More Telugu News