Chandrababu: హైదరాబాదులోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు

  • చాలా రోజుల తర్వాత హైదరాబాదుకు విచ్చేసిన చంద్రబాబు
  • టీటీడీపీ నేతలతో భేటీ కానున్న బాబు
  • రాహుల్ గాంధీకి ఫోన్ చేసే అవకాశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాదుకు విచ్చేశారు. జూబ్లీహిల్స్ లో ఉన్న తన నివాసానికి కాసేపటి క్రితం చేరుకున్నారు. కాంగ్రెస్, టీడీపీలు ప్రధాన భాగస్వాములుగా ఏర్పడిన తెలంగాణ మహాకూటమిలో ఇప్పటివరకూ సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన భేటీకానున్నారు. వారితో మాట్లాడిన తరువాత, కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఉత్తమ్ కుమార్, జానారెడ్డి తదితరులతో చంద్రబాబు మాట్లాడతారని, అవసరమైతే రాహుల్ గాంధీకి ఆయన ఫోన్ చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు.
Chandrababu
Telugudesam
tTelugudesam
Rahul Gandhi

More Telugu News