Heros: వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగాను.. ఇప్పుడు వాళ్లతోనే నటిస్తున్నాను!: కీర్తి సురేష్

  • చిన్నప్పటి నుంచి హీరోల సినిమాలు చూస్తూ పెరిగాను
  • వారితో నటించే అవకాశాలు వస్తున్నాయి
  • ఈ విషయం చెబితే, వయసు గుర్తొచ్చి హీరోలు హర్ట్ అవుతారన్న కీర్తి
'మహానటి'తో స్టార్ హీరోయిన్ గా మారిపోయి, గత వారంలో 'పందెంకోడి 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్, హీరోల వయసు విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతున్న వేళ, చిన్నతనం నుంచి చూసిన హీరోల పక్కన జోడీగా నటించడంపై స్పందించాలన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది.

 తాను ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగానని, ఇప్పుడు వారితోనే కలసి నటించే అవకాశాలు వస్తున్నాయని, అయితే, ఏ హీరో దగ్గర కూడా ఈ విషయాన్ని తాను ప్రస్తావించబోనని వెల్లడించింది. హీరోల దగ్గర 'చిన్నప్పుడు మీ సినిమాలు చూస్తూ పెరిగాను' అంటే వారికి వయసు గుర్తుకు వచ్చి హర్ట్ అవుతారని అనుకుంటున్నట్టు చెప్పింది. హీరోలంటే తనకెంతో గౌరవమని, వాళ్లను కొలీగ్స్ గా భావించలేనని, ఈ అవకాశాలు, గుర్తింపు అంతా దేవుడి దయని చెప్పుకొచ్చిందీ అందాల భామ.
Heros
Pandemkodi 2
Keerthi Suresh
Mahanati
Age
Hurt

More Telugu News