Telangana: నేడు హైదరాబాద్ కు... మహాకూటమి కోసం రంగంలోకి దిగుతున్న చంద్రబాబు!

  • మహాకూటమిలో కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు
  • హైదరాబాద్ కు బయలుదేరిన చంద్రబాబు
  • నేడు టీటీడీపీ నేతలతో ప్రత్యేక భేటీ
కాంగ్రెస్, టీడీపీలు ప్రధాన భాగస్వాములుగా ఏర్పడిన తెలంగాణ మహాకూటమిలో ఇప్పటివరకూ సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. నేడు హైదరాబాద్ కు రానున్న ఆయన, తెలంగాణ టీడీపీ నేతలతో చర్చించనున్నారు. వారితో మాట్లాడిన తరువాత, కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఉత్తమ్ కుమార్, జానారెడ్డి తదితరులతో చంద్రబాబు మాట్లాడతారని, అవసరమైతే రాహుల్ గాంధీకి ఆయన ఫోన్ చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు.

సాధ్యమైనంత త్వరలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేస్తే, ఆపై  ప్రచారం ప్రారంభించాలని టీడీపీ భావిస్తోంది. కాగా, ఈ ఎన్నికల్లో తాను వెనకుండి మద్దతు పలుకుతానే తప్ప, నేరుగా ప్రచారం చేయబోనని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణతో పాటు, కొందరు పేరున్న ఏపీ మంత్రులు కూడా తెలంగాణలో పర్యటిస్తారని సమాచారం.
Telangana
Mahakutami
Telugudesam
Chandrababu
Congress

More Telugu News