Vismayam: అర్జున్, శృతిల మధ్య ఆ సీన్ గురించి నేను చెప్పేది ఇదే... ఇంకేం అడగవద్దు: 'విస్మయ' దర్శకుడు

  • తనను అర్జున్ వేధించాడన్న శృతి
  • ఖండించిన అర్జున్
  • వివరణ ఇచ్చిన దర్శకుడు అరుణ్ వైధ్యనాథన్
'విస్మయం' సినిమా చిత్రీకరణ వేళ, హీరో అర్జున్ తనను వేధించాడంటూ హీరోయిన్ శృతీ హరిహరన్ చేసిన విమర్శలు నిరాధారమైనవని అర్జున్ స్పందించిన వేళ, నాడు జరిగిన ఘటనలపై తనకు గుర్తున్న విషయాలను ఫేస్ బుక్ పోస్టులో పంచుకున్నాడు సినిమా దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. 'విస్మయం' షూటింగ్ ను తామెంతో ఎంజాయ్ చేశామని అన్నారు.

"అర్జున్, శృతి... ఇద్దరూ నాకు మంచి మిత్రులు. ఈ చిత్రంలో వివాదాస్పదమైన ఆ సీన్ ను నేను ఎంతో రొమాంటిక్ గా రాసుకున్నాను. దాన్ని చూసిన అర్జున్, "నాకు టీనేజ్‌లో ఉన్న కూతురు ఉంది. ఇటువంటి సీన్స్‌లో  నటించలేను" అన్నారు. ఆయన సూచన మేరకు కాస్తంత శృంగారాన్ని తగ్గించాను. ఇప్పుడు శృతి చేస్తున్న ఆరోపణలు నన్ను షాక్ నకు గురి చేస్తున్నాయి. ఇది రెండేళ్ల క్రితం జరిగిన ఘటన. నాకు ఏ క్షణం ఏం జరిగిందన్న విషయం గుర్తు లేదు. ఈ వివాదం గురించి నాకు ఫోన్లుగానీ, మెసేజ్ లు కానీ చేయవద్దు. నాకు తెలిసిందంతా చెప్పాను" అని అరుణ్ వైద్యనాథన్ తన పోస్టులో చెప్పాడు.
Vismayam
Arjun
Sruti Hariharan
Arun Vaidyanathan
Harrasment
MeToo India

More Telugu News