Arjun: శృతి హరిహరన్ ఆరోపణలపై స్పందించిన హీరో అర్జున్!

  • ఎన్నడూ హీరోయిన్లను వేధించలేదు
  • ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలే
  • 'మీటూ' బలహీనపడుతోందన్న అర్జున్
సీనియర్ హీరో అర్జున్ తనను లైంగికంగా వేధించాడనీ, 'మీటూ' ఉద్యమం ఇచ్చిన ధైర్యంతోనే తాను ఇప్పుడు ముందుకొచ్చి, తనపై జరిగిన వేధింపులను బయటకు చెబుతున్నానని నటి శృతీ హరిహరన్ చేసిన వ్యాఖ్యలపై అర్జున్ స్పందించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని కొట్టిపారేసిన అర్జున్, తాను ఎన్నడూ హీరోయిన్లను వేధించలేదని చెప్పారు. ఈ తరహా ఆరోపణలతో మొత్తం 'మీటూ' ఉద్యమం బలహీనపడి పోతుందని ఆయన అన్నారు.

తనపై కుట్ర జరుగుతోందన్న అనుమానం ఉందని, ఈ విషయంలో తాను పోరాడతానని ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. శృతి హరిహరన్ తో తాను ఒకే ఒక్క సినిమాలో నటించానని చెప్పిన ఆయన, ఆ సినిమా షూటింగ్ సమయంలో తాము ఒక్కసారి కూడా ఒంటరిగా కలుసుకోలేదని స్పష్టం చేశారు. కాగా, శృతి ఆరోపణలు కోలీవుడ్ తో పాటు, దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Arjun
Tamil
Kollywood
Sruti Hariharan

More Telugu News