Rahul Gandhi: చార్మినార్ కి వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం: అసదుద్దీన్ ఒవైసీ

  • రాహుల్, అమిత్ షా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలి
  • మిత్రులైనా, శత్రువులైనా హైదరాబాద్ ఆహ్వానం పలుకుతుంది
  • మోదీకి శివసేన భయపడుతోంది
చార్మినార్ వద్దకు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్వాగతం పలికారు. మీరు, బీజేపీ అధ్యక్షుడు ఇక్కడ నుంచి పోటీ చేయాలని కోరుతున్నానని ట్వీట్ చేశారు. ఇక్కడున్న భిన్న జాతుల సంస్కృతి అంటే ఏమిటో ఇక్కడి ప్రజలు మీకు చూపిస్తారని తెలిపారు. మిత్రులైనా, శత్రువులైనా అందరికీ హైదరాబాద్ ఆహ్వానం పలుకుతుందని అన్నారు.

ప్రధాని మోదీకి శివసేన భయపడుతోందని ఒవైసీ విమర్శించారు. వారి పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారి సామ్నా పత్రికలో సంపాదకీయాలు రాసుకుంటోందని ఎద్దేవా చేశారు. కథనాలను రాసుకోవడం ఆపేయాలని శివసేనకు సూచిస్తున్నానని... మోదీని, మహారాష్ట్రలోని ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని వదిలేయాని అన్నారు. తన పూర్వీకులు భారతదేశానికి చెందినవారే అనే విషయాన్ని నిరూపిస్తానని చెప్పారు.
Rahul Gandhi
amit shah
Asaduddin Owaisi
charminar
mim
bjp
congress

More Telugu News