Balakrishna: నందమూరి ఫ్యాన్స్ కు పండగే.. కలసి సందడి చేయనున్న బాలయ్య, తారక్!

  • రేపు హైదరాబాదులో 'అరవింద సమేత' విజయోత్సవ కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న బాలయ్య
  • ఆనందంలో మునిగితేలుతున్న నందమూరి ఫ్యాన్స్
నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలసి సందడి చేయబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్, పూజాహెగ్డే కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని శిల్పకళా వేదికలో చిత్ర విజయోత్సవ సభను రేపు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కల్యాణ్ రామ్ కూడా ఈ వేడుకకు వస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లు ఒకే వేదికపై కనిపించనున్నారనే వార్త తెలియగానే నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. గతంలో బాలయ్య సినిమా 'సింహా'కు సంబంధించిన కార్యక్రమానికి తారక్ వచ్చిన సంగతి తెలిసిందే.
Balakrishna
junior ntr
tarak
aravinda sametha
tollywood
success meet

More Telugu News