Rahul Gandhi: పార్లమెంటులో మోదీని, బీజేపీని సమర్థించేది కేసీఆర్ ఒక్కరే: రాహుల్ గాంధీ

  • నోట్ల రద్దును కూడా కేసీఆర్ సమర్థించారు
  • ప్రజల మధ్య మోదీ విద్వేషాలను రగిలిస్తున్నారు
  • ఇంటి నుంచి బయటకు రావడానికి మహిళలు భయపడుతున్నారు
దేశంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా ప్రజల్లో ఆందోళన కనిపిస్తోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజల మధ్య ప్రధాని మోదీ విద్వేషాలను రగిలిస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశం ఏ ఒక్కరిదో కాదని చాటి చెప్పడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా మహిళలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్లు రద్దు కంటే పిచ్చి పని మరొకటి లేదని... నోట్ల రద్దుతో దేశ ప్రజలను క్యూలైన్లలో మోదీ నిలబెట్టారని విమర్శించారు. దేశంలోని ధనవంతుల నల్లధనాన్ని మోదీ తెల్లధనంగా మార్చారని అన్నారు. పార్లమెంటులో మోదీని, బీజేపీని సమర్థించేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దును కూడా కేసీఆర్ సమర్థించారని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలు ఒకదానికొకటి మద్దతిచ్చుకుంటున్నాయని విమర్శించారు. 
Rahul Gandhi
kcr
modi

More Telugu News