Ponnam Prabhakar: గతంలో టీడీపీతో కేసీఆర్ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు?: పొన్నం ప్రభాకర్

  • అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు
  • తెలంగాణలో రెండో మోదీ కేసీఆర్
  • ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని కూడా త్యాగంగా చెప్పుకుంటున్నారు
ముస్లింలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చెప్పారు. మహాకూటమిని విమర్శిస్తున్న కేసీఆర్... గతంలో టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రెండో మోదీలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లు కూడా పరిపాలించలేని కేసీఆర్... ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని ఒక త్యాగంగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటు వేసినా, టీఆర్ఎస్ కు ఓటు వేసినా ఒకటేనని చెప్పారు. కామారెడ్డి సభలో ప్రసంగిస్తూ... పొన్నం ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

Ponnam Prabhakar
kcr
modi
congress
bjp
TRS

More Telugu News