ys jagan: జగన్ ఆదేశిస్తే అద్దంకి నుంచి పోటీ చేస్తా!: వైసీపీ కార్యదర్శి వెంకటరెడ్డి

  • మెజారిటీ నేతలు నన్నే కోరుకుంటున్నారు
  • కుటుంబంతో చర్చించి నిర్ణయం తీసుకుంటా
  • నియోజకవర్గంలో పార్టీ గెలుపుకు కృషి చేస్తా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) అధినేత వైఎస్ జగన్ ఆదేశిస్తే ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వైసీపీ కార్యదర్శి అట్లా చిన వెంకటరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో మెజారిటీ కార్యకర్తలు, నేతలు తాను పోటీ చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ విషయమై నిర్ణయం తీసుకుంటానన్నారు. జిల్లాలోని సంతమాగులూరులోని తన ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అద్దంకి నియోజకవర్గంలో పోటీ చేసే విషయమై పార్టీ అధినేత వైఎస్ జగన్ తో ఇప్పటికే మాట్లాడానని వెంకటరెడ్డి అన్నారు. ఇందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. త్వరలోనే నియోజకవర్గం అంతటా పర్యటించి పార్టీ గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. ఎలాంటి భేషజాలు లేకుండా జిల్లా నాయకులను కలుపుకుపోతానని వెంకటరెడ్డి చెప్పారు.
ys jagan
Prakasam District
addamki
mla
YSRCP
Andhra Pradesh
venkata reddy

More Telugu News