Train Accident: ట్రాక్‌పై వందలాది మంది ఉంటారని నేను ఊహించలేదు!: ప్రమాదానికి కారకుడైన రైలు డ్రైవర్‌

  • అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
  • రైలు వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఉందని స్పష్టీకరణ
  • వివరాలు రాబడుతున్నామన్న ఉన్నతాధికారులు
‘రైలు ముందుకు వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఉంది. అందుకే వెళ్లా. ఆ సమయంలో ట్రాక్‌పై వందలాది మంది నిల్చుని ఉంటారని నేను ఊహించలేదు’...పంజాబ్‌ రాష్ట్రం అమృతసర్‌ నగరానికి సమీపంలోని జోడా ఫాటక్‌ వద్ద జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన రైలు డ్రైవర్‌ చెబుతున్న మాటలివి.

ప్రమాదం నేపథ్యంలో పంజాబ్‌ పోలీసులు, రైల్వే భద్రతా సిబ్బంది డీఎంయూ ట్రైన్‌ డ్రైవర్‌ను లూథియానా రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై అతన్ని విచారిస్తున్నారు. పోలీసుల ప్రశ్నలకు డ్రైవర్‌ ఆ విధంగా బదులిచ్చినట్లు సమాచారం. ఆ మార్గంలో వెళ్లేందుకు తనకు అనుమతి ఉన్నందువల్లే రైలు ముందుకు పోనిచ్చానని, ఇంతటి దుర్ఘటన ఊహించలేదని చెప్పినట్లు సమాచారం. దీనిపై పంజాబ్‌ పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ లోకో డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నామని, వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు.
Train Accident
draiver questioned

More Telugu News