Kadapa District: అటవీశాఖ అధికారులకు షాకిచ్చిన స్మగ్లర్లు.. కిటికీ ఊచలు తొలగించి జంప్!

  • కడప జిల్లా రాజంపేటలో ఘటన
  • 11 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసిన అధికారులు
  • అందరూ తమిళనాడు వాసులేనని వెల్లడి
ఎర్రచందనం దొంగలు అటవీశాఖ అధికారులకు షాక్ ఇచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య బంధించినప్పటికీ కిటీకీ ఊచలు తెంపి చల్లగా జారుకున్నారు. అందరూ పారిపోయేవరకూ కూడా అధికారులెవరూ వీరిని పట్టించుకోలేదు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని రాజంపేట అటవీ అధికారులు ఇటవల నిర్వహించిన దాడుల్లో తమిళనాడుకు చెందిన 11 మంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను తరలిస్తూ దొరికిపోయారు. దీంతో వీరిని అధికారులు కస్టడీలోకి తీసుకుని కేసు నమోదుచేశారు.

అనంతరం అటవీశాఖ భవనంలోని ఓ గదిలో వీరిని బంధించారు. అయితే వీరిని పట్టించుకోవడం మానేశారు. దీంతో స్మగ్లర్లు కిటికీ ఊచలను వంచి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో తలలు పట్టుకోవడం జిల్లా అధికారుల వంతయింది.
Kadapa District
smugllers
red sandals
Police
ran away
forest officials
arrest

More Telugu News