Allu Arjun: అల్లు అర్జున్ అలా నిర్ణయించుకున్నాడట!

షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏ దర్శకుడితో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది. నిన్నమొన్నటి వరకూ త్రివిక్రమ్ తో ఉంటుందా? .. విక్రమ్ కుమార్ తో ఉంటుందా? అనే విషయంపై సందిగ్ధత ఉండేది. కానీ 'అరవింద సమేత వీర రాఘవ' హిట్ తరువాత త్రివిక్రమ్ తోనే చేయాలనే నిర్ణయానికి అల్లు అర్జున్ వచ్చేశాడని సమాచారం. ఆ తరువాత ఆయన సినిమా సుకుమార్ తో ఉండవచ్చనే టాక్ వినిపించింది.

విక్రమ్ కుమార్ .. సుకుమార్ సినిమాలు ప్రయోగాత్మకంగా ఉంటాయి. ప్రస్తుతం తానున్న పరిస్థితుల్లో ఆ తరహా కథల జోలికి వెళ్లకూడదని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నాడట. తన నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలతో కూడిన కథలతో రెండు సినిమాలు చేసిన తరువాత విక్రమ్ కుమార్ తోను .. సుకుమార్ తోను చేయాలని భావిస్తున్నాడట. అంటే త్రివిక్రమ్ తరువాత మరో మాస్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ బోయపాటి కావొచ్చని ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు.
Go Back to Shorts
Allu Arjun

More Telugu News