Punjab: రైలు ప్రమాద సమయంలో ఘటనా స్థలంలోనే సిద్ధూ భార్య కౌర్.. పట్టించుకోకుండా వెళ్లిపోయిన వైనం!

  • రావణవధ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌర్
  • ప్రమాద సమయంలో ప్రసంగం
  • ప్రమాదం జరిగినా ప్రసంగం ఆపని సిద్ధూ భార్య 
పంజాబ్‌లోని జోదాపాటక్‌ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం రైలు ప్రమాదం జరిగినప్పుడు మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ అక్కడే ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రావణ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగి హాహాకారాలు మిన్నంటినా ఆమె మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు.

 అనంతరం ప్రసంగాన్ని ముగించి బాధితులవైపు కన్నెత్తి చూడకుండా, అక్కడ అసలేం జరిగిందో ఆరా తీయకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అసలీ వేడుకలు నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు ఎటువంటి అనుమతి తీసుకోలేదని అంటున్నారు. నిర్లక్ష్యంగా వెళ్లిపోతున్న నవజోత్ కౌర్‌కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు కూడా చేశారు. అయినా ఆమె పట్టనట్టు వెళ్లిపోయారని చెబుతున్నారు. దీంతో ఆమె తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.  
Punjab
Rail Accident
Navjot singh Sidhu
Navjot Kaur

More Telugu News