బాలీవుడ్ హీరోయిన్ సంజనను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై హీరో సుశాంత్ స్పందన
- 'కిజీ ఔర్ మ్యానీ' చిత్రంలో నటించిన సుశాంత్, సంజన
- సెట్లో అసభ్యకరంగా ప్రవర్తించాడని వార్తలు
- సంజనతో మెసేజ్ స్క్రీన్ షాట్లను పంపిన సుశాంత్
మీటూ ఉద్యమాన్ని కొందరు వ్యక్తిగత లాభం కోసం వాడుకుంటున్నారని సుశాంత్ మండిపడ్డాడు. కావాలనే కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని... ఆరోపణలను ఎదుర్కోవడానికి తనకు తాను మద్దతు ఇచ్చుకోక తప్పదని తెలిపాడు. ఒకరి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం తప్పని తెలిసినా... ఇలా చేయక తప్పడం లేదని చెప్పాడు. సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి రోజు వరకు సంజనతో జరిగిన సంభాషణ ఇదని తెలిపాడు. ఇక నిర్ణయించాల్సింది మీరేనని అభిమానులను ఉద్దేశించి అన్నాడు.