lakshmiparvathi: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను...వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తా : లక్ష్మీపార్వతి

షార్ట్స్‌లో చూడండి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు ఏ కోశానా లేదని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం మాత్రం చేస్తానని దివంగత ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి తెలిపారు. కృష్ణా జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మీపార్వతి పోటీ చేస్తారని గత కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు శుక్రవారం ఆమె తెరదించారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులు పోటీ విషయమై ప్రస్తావించగా ఆమె తన నిర్ణయాన్ని తెలిపారు. 
Go Back to Shorts
lakshmiparvathi
election

More Telugu News