Uttar Pradesh: నూటొక్కమంది పిల్లలకు పాద పూజ చేసిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి

షార్ట్స్‌లో చూడండి
వినూత్న కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ప్రత్యేకత చాటుకునే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ మహర్నవమి సందర్భంగా నూటొక్కమంది బాలికల పాదాలు కడిగి వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. తొలుత మాతా సిద్ధదాత్రికి పూజలు చేసిన ముఖ్యమంత్రి అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహర్నవమి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి చిన్నారులకు కానుకల రూపంలో పుస్తకాలు, ఇతర బహుమతులు అందించారు.

 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ శరన్నవరాత్రుల్లో  కుమారి పూజకు ఎంతో ప్రాధాన్యం ఉందని అన్నారు. 'మహిళ' శక్తి స్వరూపిణి అని, ఆమె ఏ రూపంలో ఉన్నా తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనదని అన్నారు. కాగా, గోరక్‌పూర్‌లోని మానస సరోవర్‌ రామ్‌లీలా మైదానంలో జరిగే రావణ వథ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ రోజు పాల్గొననున్నారు.
Go Back to Shorts
Uttar Pradesh
yogiadityanadh
kumaripuja

More Telugu News