Andria: అవకాశాల కోసం ఇష్టపడే వెళుతున్నారు కదా?: హీరోయిన్ ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు

  • మిన్నంటుతున్న 'మీటూ' ఉద్యమం
  • ఇష్టం లేకుంటే ఎవరూ పడకగదికి రమ్మని పిలవరు
  • పురుషులదే తప్పెలా అవుతుందన్న ఆండ్రియా
దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం మిన్నంటుతున్న వేళ, దక్షిణాది నటి ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు చేసింది. తానైతే 'మీటూ' ఉద్యమాన్ని స్వాగతిస్తున్నానని చెబుతూనే, స్టార్ గా వెలిగిపోవాలని, రాత్రికి రాత్రే కోట్లు సంపాదించాలని భావిస్తున్న అమ్మాయిలు, వారికి ఇష్టం లేకుండానే మగవారి గదుల్లోకి వెళుతున్నారా? అని ప్రశ్నించింది.

తప్పు మగవారిది మాత్రమే కాదని, మహిళలు అంగీకరించకుంటే, ఎవరూ పిలవరని, ఎవరిపై వారికి నమ్మకం ఉంటే పడక గదుల్లోకి రావాలని ఎవరూ పిలవరని చెప్పింది. ఇప్పటివరకూ అవకాశాల పేరు చెప్పి తనను ఎవరూ వాడుకోవాలని చూడలేదని చెప్పింది. పని కావాలంటూ వెళ్లే మహిళలు అందుకు అంగీకరించకుండా ఉంటే ఎలాంటి సమస్యా తలెత్తదని చెప్పింది. తనకు ప్రతిభ ఉంది కాబట్టే, ఎవరి గదిలోకీ వెళ్లకుండానే అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది.
Andria
MeToo India
Casting Couch

More Telugu News