Srijit: అతివలకు, అయ్యప్పకు మధ్య 20 వేల మంది భక్తులు... ఆగిన యాత్ర, తానేమీ చేయలేనంటున్న ఐజీ శ్రీజిత్!

  • ఆలయం వద్దకు వచ్చిన ఇద్దరు మహిళలు
  • అడ్డుగా నిలిచిన 20 వేల మంది భక్తులు
  • తమను చంపేసి ముందుకెళ్లాలని కూర్చున్న భక్తులు
  • ఉన్నతాధికారుల సలహా కోరిన శ్రీజిత్
భక్తుల మనోభావాల విషయంలో తానేమీ చేయలేనని, సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను తాను పాటించాల్సివుందని, దయచేసి అడ్డుతొలగాలని, ఇద్దరు అమ్మాయిలకు రక్షణగా శబరిమల ఆలయం వరకూ వెళ్లిన ఐజీ శ్రీజిత్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. వీరు వచ్చేసరికే ఆలయం వద్ద వేచివున్న దాదాపు 20 వేల మంది అడ్డుగా నిలబడగా, వారిని వారించేందుకు శ్రీజిత్ ప్రయత్నిస్తున్నారు. తమను అడ్డుకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పగా, తామందరినీ చంపేసి ముందుకు వెళ్లాలని భక్తులు భీష్మించుకుకూర్చున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని శ్రీజిత్, మహిళలకు రక్షణ కల్పిస్తూనే, విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తానని, వారు ఎలా చెబితే, అలా చేస్తానని, భక్తులు సంయమనం పాటించాలని కోరారు. ప్రస్తుతం శబరిమల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనివుంది.
Srijit
Sabarimala
Kerala
Ladies
Supreme Court

More Telugu News