Ramgopal Varma: దేవుడిపై నమ్మకం లేని రామ్ గోపాల్ వర్మ... కాణిపాకంలో ప్రత్యక్షం!

  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర బృందంతో కలసి కాణిపాకానికి
  • ప్రత్యేక పూజలు చేసిన రామ్ గోపాల్ వర్మ
  • ప్రసాదాలు అందించిన అధికారులు
తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పుకునే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర బృందంతో కలసి కాణిపాకం వచ్చిన ఆయన, స్వామివారిని దర్శించుకున్నాడు. వర్మ బృందానికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు, దగ్గరుండి పూజలు చేయించి, స్వామివారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను అందించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగానే తాను స్వామివారి వద్దకు ఆశీస్సుల కోసం వచ్చానని, సినిమా బాగా రానుందని ఈ సందర్భంగా వర్మ వ్యాఖ్యానించారు. ఎన్నడూ గుడుల్లో కనిపించని వర్మ, ఇలా కాణిపాకంలో కనిపించడంపై ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
Ramgopal Varma
Lakshmi's Ntr
Kanipakam

More Telugu News