Prabhas: ప్రభాస్ తో పెద్ద గొడవే జరిగింది... మాట్లాడటం మానేశా: కంగనా రనౌత్

షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్... 'బాహుబలి'తో  ప్రపంచవ్యాప్తంగా పాప్యులారిటీని తెచ్చుకున్న హీరో...
కంగనా రనౌత్... హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం 'మణికర్ణిక' పేరిట ఝాన్సీ లక్ష్మీ బాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది.

వీరిద్దరూ కలసి నటించిన ఒకే ఒక్క చిత్రం 'ఏక్ నిరంజన్'. అది కూడా చాలా ఏళ్ల క్రితం వచ్చింది. కానీ, ఆ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాదం, గొడవ ఏంటో తెలియదుగానీ, సమయం వచ్చినప్పుడల్లా కంగనా, ప్రభాస్ ను దెప్పిపొడుస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఆమె అదే తరహా వ్యాఖ్యలు చేసింది.

"ఏక్ నిరంజన్ సమయంలో మా మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆపై మేమిద్దరం మాట్లాడుకోవడమే మానేశాం" అని ఆమె తన మిత్రులకు చెప్పిందట. ఇదే సమయంలో 'బాహుబలి'లో ప్రభాస్ నటన చూసి గర్వంగా ఫీలయ్యానని, 'మణికర్ణిక'లో తన నటన చూసి ప్రభాస్ కూడా అదే విధంగా ఫీలవుతాడని చెప్పిందట. ఇదంతా బాగానే ఉంది కానీ, ప్రభాస్‌ కు, తనకు మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందన్న సంగతిని మాత్రం ఆమె ఏళ్లకు ఏళ్లుగా దాస్తూనే ఉందని గుసగుసలాడుకుంటున్నారు సినీ జనాలు.
Go Back to Shorts
Prabhas
Kangana Ranout
Manikarnika
Bahubali

More Telugu News