facebook: ఫేస్ బుక్ అధినేతపై ఉత్తరప్రదేశ్ కోర్టులో పిటిషన్

  • జుకర్ బర్గ్ తో పాటు పలువురిపై పిటిషన్
  • జాతీయ చిహ్నాలను, రాష్ట్రపతి, ప్రధాని లెటర్ హెడ్ లను వాడుకున్నారంటూ ఆరోపణ
  • చౌకబారు చర్యలతో డబ్బు సంపాదిస్తున్న వారిని శిక్షించాలని కోరిన పిటిషనర్
ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్, సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్ బర్గ్, చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్, ఫేస్ బుక్ ఇండియా చీఫ్ అజిత్ మోహన్ లపై ఉత్తరప్రదేశ్ లోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ లెటర్ హెడ్ లతో పాటు జాతీయ చిహ్నాలను అనుమతులు లేకుండా ఫేస్ బుక్ లో వాడారని పిటిషన్ దారు తన పిటిషన్ లో పేర్కొన్నారు.

వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా కోర్టుకు సమర్పించారు. జాతీయ చిహ్నాలను చౌకబారు స్థాయిలో వాడి, డబ్బు సంపాదిస్తున్న వారిని శిక్షించాలని పిటిషనర్ కోరారు. దేశ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేలా ఫేస్ బుక్ వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాదనలను విన్న జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆనంద్ ప్రకాశ్ తదుపరి విచారణను నవంబరు 12కు వాయిదా వేశారు.
facebook
mark juckerberg
petetion

More Telugu News