sabarimal: శబరిమల ఆలయం మూసేస్తామని నేను ఎప్పుడూ చెప్పలేదు: ప్రధాన అర్చకుడు కందారు రాజీవరు

  • 10 నుంచి 50 ఏళ్ల మహిళలు రావద్దని మాత్రమే చెప్పాను
  • సన్నిధానానికి మహిళలు వస్తే ఇబ్బందులు కలుగుతాయి
  • నెలవారీ పూజలు, వేడుకలు నిర్వహించడం మా విధి
మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశిస్తే ఆలయాన్ని మూసేస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు కందారు రాజీవరు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ, తాను అలా ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. 10 నుంచి 50 ఏళ్ల మహిళలు ఆలయానికి రావద్దని మాత్రమే తాను కోరుతున్నానని చెప్పారు. కొన్ని శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందదని తెలిపారు. సన్నిధానానికి రావడం వల్ల సమస్యలు సృష్టించినవారు అవుతారని మహిళలను ఉద్దేశించి అన్నారు.

మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే ఆలయం శబరిమల అని రాజీవరు చెప్పారు. ఆలయంలో నెలవారీ పూజలు, వేడుకలు నిర్వహించడం తమ విధి అని తెలిపారు. ఈ పూజలకు ఎలాంటి ఆటంకం కలగనివ్వబోమని చెప్పారు. మరోవైపు, ఈ తప్పుడు ప్రచారంపై కేరళ డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం ఎక్కడ నుంచి మొదలైందో గుర్తించటానికి విచారణకు ఆదేశించారు. 
sabarimal
cheif priest
women

More Telugu News