West Godavari District: పశ్చిమగోదావరి జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉండపల్లి రమేశ్!

  • లీగర్ సెల్ చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు
  • మరో 11 జిల్లాల అధ్యక్షులను నియమిస్తూ ఆదేశాలు
  • తొలి నుంచి పవన్ వెంటే
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలో కీలక నియామకాలు చేపడుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడిగా న్యాయవాది ఉండపల్లి రమేశ్ నాయుడును నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీచేసింది. రమేశ్ నాయుడు స్వస్థలం భీమవరం. రమేశ్ తో పాటు మరో 11 జిల్లాలకు లీగల్ సెల్ అధ్యక్షులను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.

రమేశ్ నాయుడు ప్రస్తుతం 'చిరుపవన్‌తేజం' వ్యవస్థాపక అధ్యక్షుడిగా, మెగాఫ్యాన్స్‌ జిల్లా అధ్యక్షుడిగా, కాపు యువసేన జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2009లో ప్రజారాజ్యంలో చేరిన రమేశ్ యువరాజ్యం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2014లో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అప్పటి నుంచి రాజకీయాలలో కొనసాగుతున్నారు. జనసేన పార్టీ ప్రారంభించాక ఆ పార్టీ అనుచరుడిగా ఉంటున్నారు. 
West Godavari District
Andhra Pradesh
assembly election

More Telugu News