Chandrababu: పండగ రోజు కుటుంబానికి దూరంగా చంద్రబాబు.. ‘తిత్లీ’ సహాయకచర్యలపై ఆరా

  • తిత్లీ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు
  • ఈ నెల 29లోపు సహాయకచర్యలు పూర్తి చేయాలని ఆదేశాలు
  •  నష్టపరిహార చెక్కుల పంపిణీ చేస్తాం
దసరా పండగ రోజు సీఎం చంద్రబాబునాయుడు తన కుటుంబానికి దూరంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఈరోజు కూడా పర్యటిస్తున్నారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ నెల 29లోపు సహాయకచర్యలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 29 నుంచి బాధితులకు నష్టపరిహార చెక్కులను పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. కాగా, తాను ఉద్దానం ప్రాంతంలో ఉండడం వల్లే సహాయ పునరావాస పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని, లేకుంటే ఇంత వేగంగా పనులు పూర్తికావని నిన్న చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే, విజయదశమి వేడుకలు ఇక్కడే నిర్వహిస్తానని పేర్కొన్నారు.
Chandrababu
Srikakulam District
titli

More Telugu News