ఏడేళ్ల బాలికను రేప్ చేసి చంపేసిన హంతకుడికి మరణశిక్ష అమలు... బాధితురాలి తండ్రి ఎదుటే ఉరి!
- చిన్నారిని దారుణంగా చంపేసిన ఇమ్రాన్ అలీ
- మరో ఆరుగురు అమ్మాయిలనూ హత్య చేసినట్టు నిరూపించిన పోలీసులు
- దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన
- ఉరి శిక్షను అమలు చేసిన పాక్ పోలీసులు
ఆపై విచారణలో మరో ఆరుగురు అమ్మాయిలనూ అతను హత్య చేసినట్టు తేలింది. కోర్టు తీర్పు మేరకు జైనబ్ తండ్రి అమిన్ అన్సారీ కళ్లముందు అతన్ని ఉరితీశారు. ఈ ఉరిశిక్షను బహిరంగంగా అమలు చేయాలని, అందరి ముందూ ఉరి తీయాలని అమిన్ అన్సారీ చేసిన డిమాండ్ ను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. శిక్ష అమలు తరువాత అతను మీడియాతో మాట్లాడుతూ, తన బిడ్డ తిరిగిరాదన్న సంగతి తనకు తెలుసునని, అయితే, న్యాయం గెలిచిందన్న సంతృప్తి మాత్రం మిగిలిందని అన్నాడు. ఈ ఉరిశిక్షను మీడియాలో చూపించాలని కోరాడు.