Tanusri Datta: నానాపటేకర్ అలా చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు: రాజ్‌ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

  • నానాపటేకర్‌పై ఆరోపణలు నమ్మబుద్ధి కావడం లేదు
  • సోషల్ మీడియాలో ‘మీటూ’పై రచ్చ అనవసరం
  • మమ్మల్ని సంప్రదిస్తే న్యాయం చేస్తాం
బాలీవుడ్ ప్రముఖ నటుడు నానాపటేకర్‌పై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు అసభ్యంగా ప్రవర్తించే (ఇన్ డీసెంట్) వ్యక్తే కావచ్చని, అయితే, అలా ప్రవర్తించారంటే మాత్రం నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీటూ ఉద్యమం చాలా తీవ్రమైందేనన్న ఆయన దీనిపై సోషల్ మీడియాలో రచ్చ అనవసరమన్నారు. దీనిపై కోర్టులు కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.

నానాపటేకర్ అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి అయి ఉండొచ్చని, కానీ ఇలా చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు. దయచేసి ఇకపై ట్విట్టర్‌లో మీటూ ఉద్యమానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని సూచించారు. పెట్రో ధరల పెరుగుదల, రూపాయి పతనం, పెరుగుతున్న నిరుద్యోగంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే మీటూ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు తమ పార్టీని సంప్రదిస్తే న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. లైంగిక వేధింపులు జరిగిన పదేళ్ల తర్వాత స్పందిస్తే కుదరదని, ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయాలని బాధిత మహిళలకు రాజ్‌ఠాక్రే సూచించారు.
Tanusri Datta
Bollywood
Nana patekar
MNS
raj thackeray

More Telugu News