Chandrababu: మేమూ చేశామండి పాదయాత్ర.. అదెంత పవిత్రంగా ఉండాలో తెలుసా?: చంద్రబాబు

  • పాదయాత్ర మధ్యలో నేనెప్పుడూ ఇంటికి వెళ్లలేదు
  • వారంలో ఓ రోజు ఇంటికి, మరో రోజు కోర్టుకా?
  • ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనకు సీఎం కుర్చీపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు. మాట్లాడితే సీఎంను అయిపోతానని చెబుతున్న ఆయనకు ప్రజలపై ఉన్న శ్రద్ధ ఏపాటితో అర్థమవుతోందన్నారు. పక్క జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయనకు శ్రీకాకుళం వచ్చి తపాను బాధితులను పరామర్శించే తీరిక లేకుండా పోయిందన్నారు. మరికొన్ని రోజుల్లో ముఖ్యమంత్రిని అయిపోతానని ఆయన ప్రకటించేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

వారంలో ఓ రోజు కోర్టుకు, మరో రోజు ఇంటికి వెళ్లి వచ్చి పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. తాము కూడా పాదయాత్ర చేశామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. పాదయాత్రను ఎంతో పవిత్రంగా చేయాలని అన్నారు. తాను పాదయాత్రను ప్రారంభించినప్పటి నుంచి ముగించే వరకు ఇంటి ముఖమే చూడలేదన్నారు. తుపాను బాధితులను రెచ్చగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నేతలను ఇక్కడకు పంపి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
Chandrababu
Andhra Pradesh
Srikakulam District
Titli cyclone
Jagan
YSRCP

More Telugu News