titli: ‘తిత్లీ’ బాధితులకు నందమూరి బాలకృష్ణ విరాళం

  • రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించిన బాలకృష్ణ
  • ఏపీ ఐఏఎస్ అధికారుల సంఘం కూడా విరాళం
  • ఒక రోజు వేతనాన్ని అందజేస్తామన్న శశిభూషణ్
‘తిత్లీ’ తుపాన్ బాధితులను ఆదుకోవాలన్న ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ విరాళాలను ప్రకటించారు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన వంతు సాయం ప్రకటించారు. సీఎం సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, తుపాన్ బాధితులకు ఏపీ ఐఏఎస్ అధికారుల సంఘం కూడా విరాళం ప్రకటించింది. ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్టు సంఘం అధ్యక్షుడు శశిభూషణ్ తెలిపారు. సహాయకచర్యల్లో అధికారులు పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారని చెప్పారు.
titli
nandamuri
Balakrishna

More Telugu News