mj akbar: ‘మీటూ’ ఎఫెక్ట్.. కేంద్ర సహాయ మంత్రి ఎంజే అక్బర్ రాజీనామా

  • విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి పదవికి రాజీనామా
  • అక్బర్ పై 15 మంది మహిళల ఆరోపణలు
  • మహిళా జర్నలిస్టుపై పరువు నష్టం దావా వేసిన అక్బర్
‘మీటూ’ ఉచ్చులో చిక్కుకున్న కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు. మహిళా జర్నలిస్టు ప్రియా రమణి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. కాగా, ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ప్రియా రమణిపై ఆయన పరువునష్టం దావా వేశారు. ఇప్పటి వరకు అక్బర్ పై 15 మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తాజాగా తుషితా పటేల్ అనే మరో మహిళ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం గమనార్హం.
mj akbar
metoo
resigns

More Telugu News