ramulu naik: ఇరవై ఏళ్ల అనుబంధాన్ని ఇరవై నిమిషాల్లో కేటీఆర్ బొందపెట్టారు: బహిష్కృత నేత రాములు నాయక్

  • షోకాజ్ నోటీసు ఇవ్వకుండా నన్ను సస్పెండ్ చేశారు
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయం
  • టీఆర్ఎస్ అభ్యర్థుల్లో డెబ్బై మంది కుంటి గుర్రాలే
టీఆర్ఎస్ తో తన ఇరవై ఏళ్ల అనుబంధాన్ని ఇరవై నిమిషాల్లో కేటీఆర్ బొందపెట్టారని టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన రాములు నాయక్ మండిపడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా అహంకారంతో తనను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండాలు, గూడేలకే ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు. రెండు కులాల మధ్య గతంలో ఏ ముఖ్యమంత్రి చిచ్చుపెట్టలేదని, గోండులకు- లంబాడాలకు, యాదవులకు-కురుమలకు, బెస్తలకు-ముదిరాజ్ లకు మధ్య చిచ్చుపెట్టారని కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని, 25 నుంచి 30 సీట్లకు మించి ఆ పార్టీకి రావని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల్లో డెబ్బై మంది కుంటి గుర్రాలేనని వ్యాఖ్యానించారు.
ramulu naik
TRS rebel
tr

More Telugu News