Andhra Pradesh: అవునురా బై నేను పొట్టిదాన్నే.. నీ నొప్పి ఏంటి?: విమర్శకులకు నటి మాధవీలత ఘాటు కౌంటర్!

  • ఇటీవల బతుకమ్మ సంబరాల్లో మాధవి
  • వీడియోలను అభిమానులతో పంచుకున్న నటి
  • పొట్టిదంటూ సోషల్ మీడియాలో విమర్శలు
టాలీవుడ్ నటి మాధవీలత కొందరు నెటిజన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను పొట్టిగా ఉన్నానని కొందరు విమర్శించడంపై ఫేస్ బుక్ లో ఘాటుగా జవాబిచ్చింది. ఇటీవల శ్రీనగర్ కాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మాధవీలత పొల్గొంది. అనంతరం దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు ‘మాధవీలత పొట్టిది’ అంటూ కామెంట్లు పెట్టారు.

ఈ విమర్శలపై స్పందించిన మాధవీలత ‘నేను శ్రీనగర్ కాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నా. దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశా. అయితే చాలామంది పొట్టిది..పొట్టిది అని కామెంట్లు పెట్టారు. అవునురా బై.. నేను పొట్టిగనే ఉంటా. నీకేమైనా ఎక్కడన్నా నొప్పి వచ్చిందా? నీకేమయినా మాయరోగం వచ్చిందా? నీకేమయినా పోయేకాలం వచ్చిందా? లేదు కదా.

మీ అమ్మ, మీ అక్కా, మీ చెల్లి అంతా పొడవుగానే ఉన్నారు కదా. ఇంక హ్యాపీగా ఉండు. నాకు లేనిది మీకున్నందుకు సంతోషించండి. నామీద పడి ఎందుకు ఏడుస్తారు? నేను పొట్టిగా ఉండటం వల్ల ఎవడికైనా నొప్పివస్తే చెప్పండి. ఆ నొప్పికి వెళ్లి ఆసుపత్రిలో చూపించుకోండి. లేదంటే అది శాడిస్టిక్ రోగం అనుకుంటా. వెళ్లి ట్రీట్‌‌మెంట్ తీసుకో. ఫోటో పెడితే నచ్చితే నచ్చింది.. లేదంటే నచ్చలేదు అని చెప్పాలి. నేను పొట్టిదాన్నే.. నేను నల్లగా ఉంటా. అయితే నీకేంటి? నీకు నచ్చకపోతే నా పేజ్ నుంచి వెళ్లిపో’ అని ఫేస్ బుక్ లైవ్ లో ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
Andhra Pradesh
Telangana
madhavi latha
Tollywood
batukamma
Social Media
Facebook live
Viral Videos
height
trolls

More Telugu News