mj akbar: అర్ధనగ్నంగా వచ్చి ముద్దుపెట్టుకోబోయాడు: కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ పై మరో మహిళ ఆరోపణ

  • మీటూ ఉచ్చులో చిక్కుకున్న ఎంజే అక్బర్
  • హోటల్ లో లైంగికంగా వేధించారన్న తుషితా పటేల్
  • రెండు సార్లు వేధింపులకు గురయ్యానన్న బాధితురాలు
కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ మీటూ ఉద్యమం దెబ్బకు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే లైంగిక ఆరోపణలతో సతమతమవుతున్న ఆయనపై తాజాగా మరో మహిళ ఆరోపణలు గుప్పించారు. ఎంజే అక్బర్ తనను లైంగికంగా వేధించారని తుషితా పటేల్ అనే మహిళ ఆరోపించారు.

 ఓ హోటల్ లో అర్ధనగ్నంగా తనను కలిశారని, ముద్దు పెట్టుకోవడానికి యత్నించారని ఆమె తెలిపారు. ఆయన నుంచి తనకు రెండు సార్లు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. మరోవైపు, తనపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలేనని అక్బర్ వాదిస్తున్నారు. అంతేకాదు తనపై ఇంతకుముందు లైంగిక ఆరోపణలు చేసిన పాత్రికేయురాలు ప్రియా రమణిపై పరువు నష్టం దావా కూడా వేశారు. 
mj akbar
metoo
tushita patel
bjp
sexual harrassment

More Telugu News