kcr: కేసీఆర్ కు జలుబు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కవిత

  • నిన్న జరిగిన టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ భేటీ
  • సమావేశంలో పలుమార్లు ముక్కు చీదిన కేసీఆర్
  • కుదుటపడిన కవిత ఆరోగ్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జలుబుతో బాధపడుతున్నారు. నిన్న ఆయన అధ్యక్షతన టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మధ్యమధ్యలో పలుమార్లు ముక్కు చీదారు.

మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ కవిత హైదరాబాదులోని యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆమె ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు ఆమె జ్వరంతో బాధపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. అనారోగ్య కారణాలతో ఆమె తన జిల్లాల పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు.
kcr
kavitha
TRS
ill

More Telugu News