ram gopal varma: ఎన్టీ రామారావు పోలికలతో ఎవరైనా ఉంటే చెప్పండి .. 10 లక్షలు మీవే: వర్మ ఆఫర్

  • వర్మ దర్శకత్వంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'
  • నిర్మాతగా రాకేశ్ రెడ్డి 
  • ఈ నెల 19వ తేదీన సెట్స్ పైకి
లక్ష్మీపార్వతి జీవితచరిత్ర ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే బయోపిక్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ రెడీ అవుతున్నాడు. రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఈ నెల 19వ తేదీన తిరుపతిలో ఆరంభించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్రకి గాను .. ఆ పోలికలతో వున్న ఓ వ్యక్తి వీడియోను షేర్ చేసి, అతని గురించిన వివరాలు తెలిపిన వారికి లక్ష రూపాయలు కానుకగా ఇస్తానని ఇటీవల వర్మ ప్రకటించడం, అలా రోహిత్ అనే వ్యక్తికి లక్ష రూపాయల బహుమతిని అందజేయడం జరిగిపోయింది. అలాగే ఎన్టీ రామారావు పోలికలతో ఎవరైనా కనిపిస్తే చెప్పండి .. 10 లక్షలు బహుమతిగా ఇస్తానని తాజాగా వర్మ ప్రకటించాడు.

లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కలుసుకున్నప్పుడు ఆయన ఎలా వుండేవారో .. అలాంటి పోలికలు కలిగిన వ్యక్తి వివరాలు తెలియజేయండి .. అందుకు సంబంధించిన వీడియోను [email protected]కి పంపించండి అని ప్రకటించాడు. రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలి మరి.     
ram gopal varma

More Telugu News