pawan kalyan: నేను పంచె కడుతుండటానికి కారణం ఇదే: పవన్ కల్యాణ్

  • తెలుగువాడినని చెప్పేందుకే పంచె కడుతున్నా
  • కాటన్ ఆశయంతో చంద్రబాబు పోలవరం నిర్మించాలి
  • శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి మళ్లీ తూర్పుగోదావరికి వస్తా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో పంచె కడుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ ఉదయం ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను తెలుగువాడినని చెప్పేందుకే పంచె కడుతున్నానని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరంలో ఈరోజు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, అభివృద్ధి జరగాలని... అయితే, ప్రజలను భయపెట్టి వారి భూములను లాక్కోరాదని అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఉన్నతాశయంతో ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించారని... అదే ఆశయంతో చంద్రబాబు కూడా పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

దేశం కోసం, సమాజం కోసం తాను చావడానికైనా సిద్ధమేనని పవన్ చెప్పారు. సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లి మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటస్తానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతానికి పితాని బాలకృష్ణ పేరును మాత్రమే ప్రకటించామని తెలిపారు.
pawan kalyan
panche
janasena
chandrababu
polavaram

More Telugu News