kavitha: టీఆర్ఎస్ ఎంపీ కవితకు అస్వస్థత.. కాసేపట్లో ఆసుపత్రికి వెళ్లనున్న కేసీఆర్, కేటీఆర్!

  • తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న కవిత
  • యశోదా ఆసుపత్రిలో చేరిక
  • జిల్లాల పర్యటన వాయిదా
టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. కాసేపట్లో ఆమె తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లు ఆసుపత్రికి వెళ్లనున్నారు.

వాస్తవానికి ఈరోజు ఆమె జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అనారోగ్యం కారణంతో ఆమె పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. 
kavitha
TRS
ill
hopital

More Telugu News