KTR: నాడు నువ్వెక్కడున్నావ్?: తనపై విమర్శలకు కేటీఆర్ ఘాటు సమాధానం!

  • 2014లో కేటీఆర్ నేరుగా మంత్రి అయ్యారంటూ ప్రచారం
  • ఉద్యమంలో పాల్గొన్నది ఎవరో చూడండి
  • ఫొటోలు పోస్టు చేసిన కేటీఆర్
'2006 నుంచి 2014 వరకూ 8 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొంటున్న వేళ, నువ్వు ఎక్కడున్నావ్?' అని తనను విమర్శిస్తున్న వారికి యువనేత కేటీఆర్ ఘాటైన సమాధానం ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు.

"నేను కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాను. కొందరు స్కాంగ్రెస్ వారు నేను 2014లో నేరుగా మంత్రినయ్యానని, ఉద్యమంలో పాల్గొనలేదని అంటున్నారు. నిరసనల వేళ, అడ్డుకట్టలను దాటేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరో మీరే చూడండి" అంటూ కొన్ని ఫొటోలను కేటీఆర్ పోస్టు చేశారు. ఇనుప కంచెలను దాటేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్న చిత్రాలు, రహదారిపై బైఠాయింపు, పోలీసుల అరెస్ట్ సందర్భంగా కిందపడిపోయిన చిత్రాలు ఇందులో ఉన్నాయి.
KTR
Telangana
Agitation
Twitter

More Telugu News