KCR: కేసీఆర్ పై గద్దర్ పోటీ చేస్తారు.. గద్దరే నిజమైన నాయకుడు!: కంచె ఐలయ్య

  • పోటీకి గద్దర్ అంగీకరించారు
  • ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారు
  • రాహుల్ గాంధీ కూడా సానుకూలమే
  • టీ-మాస్ చైర్మన్ కంచె ఐలయ్య
గజ్వేల్ నుంచి కేసీఆర్ పై ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేయనున్నారని టీ-మాస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గద్దర్ పోటీ చేస్తారని, ఇందుకు ఆయన కూడా అంగీకరించారని అన్నారు. నాగర్ కర్నూల్ లో జరిగిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సమావేశంలో మాట్లాడిన ఆయన, ఇటీవల రాహుల్ గాంధీని గద్దర్ కలిశారని, ఆ సమయంలో గజ్వేల్ లో కాంగ్రెస్ అభ్యర్థిని నిలపరాదని గద్దర్ కోరగా, రాహుల్ సైతం సానుకూలంగా స్పందించారని అన్నారు.

సెలైన్ బాటిల్ సాయంతో కేసీఆర్ చేసిన ఉద్యమం కన్నా, శరీరంలో బులెట్లను దాచుకుని ఉద్యమం చేసిన గద్దర్ నిజమైన నాయకుడని ఆయన అన్నారు. బడుగులకు రాజ్యాధికారం దక్కాలన్నదే బీఎల్ఎఫ్ లక్ష్యమని, తాము అధికారంలోకి వస్తే, రైతు బంధు పథకాన్ని తొలగించి, దాని స్థానంలో కూలీ బంధు పథకాన్ని అమలు చేస్తామని అన్నారు.
KCR
Gaddar
Telangana
Kanche Ilayya
Rahul Gandhi
Gajwel

More Telugu News