Srikakulam District: బాలయ్య ఫ్యాన్స్ దాతృత్వం... సిక్కోలు వాసులకు సాయం!

  • శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ
  • రూ. 1,71,346 సేకరించిన బాలయ్య ఫ్యాన్స్
  • ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేత
నందమూరి బాలకృష్ణ అభిమానులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేయగా, అక్కడ నిరాశ్రయులుగా మిగిలి, తిండి, నీటి కోసం అలమటిస్తున్న ప్రజలకు సాయపడేందుకు ముందుకు కదిలారు.

'మన బాలయ్య డాట్ కామ్' నిర్వాహకుడు పుల్లెల గౌతమ్ ఆధ్వర్యంలో రూ. 1,71,346ల విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని ఉండవల్లి ప్రజా వేదికలో భాగంగా సీఎం చంద్రబాబును కలిసి ఆయనకు అందజేశారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వ కాలేజీల అధ్యాపకుల అసోసియేషన్ తమ ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది.
Srikakulam District
Titley
Balakrishna
Cm Relief Fund

More Telugu News