Pawan Kalyan: పవన్ కవాతుపై మంత్రి దేవినేని విమర్శలు

  • ఇదే బ్యారేజ్ పై నాడు జగన్ సినిమా చూపారు
  • దానికి పోటీగానే పవన్ కవాతు నిర్వహించారు
  • డ్యామ్ లపై బలప్రదర్శన తగదు
ధవళేశ్వరంలో ‘జనసేన’ నిర్వహించిన కవాతుపై ఏపీ టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు విజ్ఞతతో వ్యవహరించాలని, డ్యామ్ లపై బలప్రదర్శన తగదని హితవు పలికారు.

సందుల్లో, గొందుల్లో సభలు పెట్టి జనం ఎక్కువగా వచ్చినట్టు చూపుతున్నారని, దమ్ముంటే జాతీయ రహదారులపై ఇలాంటి సభలు పెట్టాలని సవాల్ విసిరారు. గతంలో ధవళేశ్వరం బ్యారేజ్ పై వైసీపీ పాదయాత్ర గురించి ఈ సందర్భంగా దేవినేని ప్రస్తావించారు. నాడు డ్రోన్ల సాయంతో జగన్ సినిమా చూపారని, దానికి పోటీగానే పవన్ కవాతు నిర్వహించారని విమర్శించారు. మొన్నటివరకూ ‘ఉద్దానం..ఉద్దానం’ అని కలవరించిన నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారని వ్యంగ్యంగా అన్నారు.   
Pawan Kalyan
devineni
dawaleswaram

More Telugu News