Chandrababu: డొంకలో దాక్కుంటే పిడుగుపాటు తప్పదనుకుంటున్నారా?: చంద్రబాబుపై పవన్ సెటైర్లు

  • చెయ్యాల్సిన కుంభకోణాలన్నీ చంద్రబాబు చేశారు
  • అవినీతి ఆరోపణల నుంచి ఆయన బయటపడాలి
  • ‘క్లీన్’ అని నిరూపించుకోవాలి
ఐటీ దాడుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ధవళేశ్వరంలో ఈరోజు నిర్వహించిన ‘జనసేన’ బహిరంగ సభ వేదికగా ఆయన మాట్లాడుతూ, చెయ్యాల్సిన కుంభకోణాలు, దోపిడీలన్నీ చేసి, అన్ని వ్యవహారాలు చేసి.. డొంకలో దాక్కుంటే పిడుగుపాటు తప్పదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కచ్చితంగా తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి బయటపడాలని, ‘క్లీన్’ అని నిరూపించుకోవాలని అన్నారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, కలిసికట్టుగా పోరాడదామని, ఢిల్లీకి వెళ్లి నిలదీద్దామని చంద్రబాబుకు పవన్ సూచించారు.
Chandrababu
Pawan Kalyan
dhavaleswaram

More Telugu News