యువత ఎక్కువగా ఉండే ఏకైక దేశం భారత్: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం
- లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అబ్దుల్ కలాం
- విద్యార్థులు కలాం వంటి గొప్ప వ్యక్తులు కావాలి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, విద్యార్థులు, యువతకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని, విజన్- 2020 తయారు చేయడంపై నాడు అబ్దుల్ కలాంతో కలిసి చర్చించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. దేశాధ్యక్షుడిగా మారి లక్షల మందికి స్ఫూర్తిగా, ఆదర్శ వ్యక్తిగా నిలిచిన వ్యక్తి కలాం అని కొనియాడారు. విద్యార్థులు అబ్దుల్ కలాం వంటి గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని ఆకాంక్షించారు.