thumders: విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల కాసేపట్లో పిడుగులు పడే అవకాశం!

  • హెచ్చరికలు జారీ చేసిన విపత్తుల నిర్వహణ శాఖ
  • సురక్షిత భవనాల్లో తలదాచుకోవాలని ప్రజలకు సూచన 
  • అప్రమత్తంగా వ్యవహరించాలంటూ సూచించిన అధికారులు 
విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో కాసేపట్లో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖపట్టణం జిల్లాలోని కశింకోట,మాకవరపాలెం, బుచ్చయ్య పేట, చోడవరం, రావికమతం, మునగపాక, యలమంచిలిలో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలోని వై.రామవరం, అడ్డతీగల, రంపచోడవరం, గంగవరం మండలాలకు కూడా ముప్పు ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత భవనాల్లో తలదాచుకోవాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. 
thumders
Visakhapatnam District
East Godavari District

More Telugu News