patancheru: టీడీపీలో చేరుతున్నా: పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే

  • ఈ నెల 19న టీడీపీలో చేరుతున్నా
  • ఎన్టీఆర్ ఆశయ సాధనే నా లక్ష్యం
  • మహాకూటమి టికెట్ ఎవరికిచ్చినా.. వారి కోసం పని చేస్తా
మెదక్ జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ టీడీపీలో చేరనున్నారు. ఈనెల 19న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. తాను ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తే కారణమని... ఆయన ఆశయాల సాధన కోసమే టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. మహాకూటమి టికెట్ ఎవరికిచ్చినా.. వారికోసం తాను పని చేస్తానని తెలిపారు.

2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నందీశ్వర్ గౌడ్ పని చేశారు. ఈ తర్వాత 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరి, అక్కడ ఇమడలేకపోయారు. ఆయన మళ్లీ కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ... చివరకు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మహాకూటమిలో భాగంగా పటాన్ చెరు టికెట్ టీడీపీకి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఇక్కడ ఆంధ్ర ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. టీడీపీలో చేరితే టికెట్ తనకు దక్కే అవకాశం ఉందని నందీశ్వర్ గౌడ్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. 
patancheru
mla
nandiswar gowd
Telugudesam
congress
bjp
TRS
telangana

More Telugu News