Chandrababu: ఏపీ నాశనం కావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి: మంత్రి సోమిరెడ్డి ఫైర్

  • అవినీతి రాష్ట్రంగా చూపాలని బీజేపీ, జగన్ యత్నం
  • ఎంత ప్రయత్నించినా అలా చిత్రీకరించలేరు
  • తుపాన్ బాధితులను ఆదుకునేందుకు సీఎం   శ్రమిస్తున్నారు
ఏపీ నాశనం కావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీని అవినీతి రాష్ట్రంగా చూపాలని బీజేపీ, జగన్ యత్నిస్తున్నారని, వారు ఎంత ప్రయత్నించినా ఆ విధంగా చిత్రీకరించలేరని అన్నారు. ఈ సందర్భంగా తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని, కొబ్బరి, జీడిమామిడితోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, జీడిమామిడితోటలకు హెక్టారుకు రూ.25 వేల నష్టపరిహారం ప్రకటించామని అన్నారు. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రి ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్నారని, సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
Chandrababu
somireddy

More Telugu News