NTR: ఏపీ సీఎం సహాయనిధికి రూ. 15 లక్షలు ఇస్తున్నా: ఎన్టీఆర్

  • తిత్లీ దెబ్బకు విలవిల్లాడిన శ్రీకాకుళం
  • ఆదుకోవాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
  • కల్యాణ్ రామ్ తరఫున రూ. 5 లక్షలు
తిత్లీ తుపాను దెబ్బకు విలవిల్లాడిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు ముందుకు వచ్చి, సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై నందమూరి వారసులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు స్పందించారు. ఎన్టీఆర్ రూ. 15 లక్షలను, కల్యాణ్ రామ్ రూ. 5 లక్షలను ఏపీ సీఎం సహాయనిధికి పంపుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటన వెలువడింది.

ఈ నిధులను తుపానుతో దెబ్బతిన్న ఉత్తర కోస్తా బాధితులను ఆదుకునేందుకు వినియోగించాలని వారు కోరారు. కాగా, సిక్కోలుకు అండగా నిలిచేందుకు సినీ పరిశ్రమ ముందుకు వస్తోంది. ఇప్పటికే నటుడు విజయ్ దేవరకొండ తనవంతు సాయంగా రూ. 5 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
NTR
Kalyanram
Srikakulam District
Chandrababu
Titley
Relief Fund

More Telugu News