Srikakulam District: ఆహా యుగ పురుషుడు... రెండడుగుల నీళ్లలో సైతం లైఫ్ జాకెట్ వేసుకున్నారు!: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వ్యంగ్యం

  • శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • రెండడుగుల నీటిలో లైఫ్ జాకెట్ ధరించిన చంద్రబాబు
  • తమ్ముళ్లూ నేర్చుకోవాలంటూ విజయసాయి ట్వీట్
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపానుకు అతలాకుతలమైన ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన వేళ తీసిన ఓ ఫొటోను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

సుమారు రెండు అడుగుల మేరకు కూడా నీరు లేని చోట, బోటు చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, అధికారులు ప్రజలు ఉండగా, ఒక్క చంద్రబాబునాయుడు మాత్రం లైఫ్ జాకెట్ వేసుకుని, బోట్ లో కూర్చుని ఉన్నట్టు ఈ చిత్రం కనిపిస్తోంది. దీనికి... "అహా యుగ పురుషుడు... రెండడుగుల నీళ్లలో సైతం లైఫ్ జాకెట్ వేసుకున్నారు. చూసి నేర్చుకోండి తమ్ముళ్లూ, జాగ్రత్త అంటే అలా ఉండాలి మరి...వారు ఏం చేసినా ఒక సందేశమే..." అని క్యాప్షన్ పెట్టారు.
Srikakulam District
Chandrababu
Vijayasai Reddy
Twitter

More Telugu News